యువ వైద్యురాలు ఆత్మహత్య
07-09-2026 | 07:00pm
ఉప్పల్,(విజయక్రాంతి): కుషాయిగూడ పోలీస్‌స్టేషన్(Kushaiguda Police Station) పరిధిలో యువ వైద్యురాలు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తిరుపతికి చెందిన డాక్టర్ కీర్తి (28) ఇటీవలే రాఘవ అనే వ్యక్తి వివాహం చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా కుషాయిగూడలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యురాలిగా సేవలందిస్తున్న కీర్తి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య(commits suicide) చేసుకున్నారు. అది గమనించిన స్థానికులు కుషాయిగూడ(Kushaiguda) పోలీసులకు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి(Gandhi Hospital) తరలించారు. యువ వైద్యురాలి ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కుటుంబ సభ్యులు మరియు బంధువులను విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
