పోలీస్ స్టేషన్లో నిప్పు పెట్టుకున్న యువకుడు
10-09-2026 | 08:40am
- చికిత్స పొందుతూ మృత్యువాత.
- అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెట్టటం.
- ప్రేమ వికటించడమే కారణం.
- రామయంపేటలో ఘటన.
రామాయంపేట,(విజయక్రాంతి): రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్(Police Station) ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్ ( 33) పెయింటర్ గా పనిచేస్తున్నాడు.ఇతను కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో పెళ్లికి కోరగా వికటించి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. దీంతో పోలీసులు దుర్గాప్రసాద్ తోపాటు అమ్మాయి తరపువారిని పోలీస్ స్టేషన్ కు పిలిచారు. ఈ క్రమంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ డబ్బాతో ఒంటిపై పోసుకొని పండించుకున్న దుర్గాప్రసాద్ మంటల్లో కాలికుప్పకూలాడు. తీవ్ర గాయాలైన అతన్ని పోలీసులు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి(Gandhi Hospital) తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ప్రాణాలు వదిలాడు. ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.