పర్యావరణ పరిరక్షణలో వైఆర్పీ ఫౌండేషన్
హైదరాబాద్, నల్లగొండలో 20 వేల మట్టి గణేశ ప్రతిమల పంపిణీ
హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయ పండుగల స్ఫూర్తిని కొనసాగించాలనే ఉద్దేశంతో వైఆర్పీ ఫౌండేషన్ (YRP Foundation) ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో 20వేల పర్యావరణహిత మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేస్తోంది. వైఆర్పీ ఫౌండేషన్ చేపడుతున్న ఈ పర్యావరణహిత కార్యక్రమం తొమ్మిదో ఏడాదికి చే రుకుంది.
మట్టి విగ్రహాలను ప్రోత్సహించ డం ద్వారా వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో పాటు ప్రకృతి పరిరక్షణకు అనుగు ణంగా నిర్వహించవచ్చనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ ఏడాది పంపిణీ చేస్తున్న విగ్రహాలకు మరో ప్రత్యేకత ఉంది. విగ్రహాల్లో మొ క్కల విత్తనాలను పొందుపర్చారు. పండుగ అనంతరం విగ్రహాన్ని కుండీలో లేదా నేల లో ఉంచి నీరు పోస్తే, మట్టి క్రమంగా కలిసిపోయి అందులోని విత్తనం మొలకెత్తి మొక్క గా పెరిగేలా వీటిని రూపొందించారు.
భక్తి, సంప్రదాయంతో పాటు పర్యావరణ పరిరక్షణను మేళవించే వినూత్న ప్రయత్నంగా ఇది నిలుస్తుంది. ఈ సందర్భంగా వైఆర్పీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, వైష్ణవి గ్రూప్ ఫౌండర్ అండ్ చైర్మన్ యెలిశాల రవి ప్రసాద్ మాట్లాడుతూ మట్టి గణేశ విగ్రహాలను ప్రోత్సహిం చడం ద్వారా పర్యావరణహిత వేడుకలకు ప్ర జలను ప్రోత్సహించాలన్నదే మా ప్రయత్నం అని అన్నారు.
ఈ ఏడాది విత్తనాలను కలిగిన విగ్రహాలను అందించడం ద్వారా, పం డుగ ముగిసిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఒక మొక్క రూపంలో ప్రకృతికి తిరిగి ఏదైనా అందించాలనే ఆలోచనను తీసుకెళ్లాలని కో రుకుంటున్నామన్నారు. చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు నాంది పలుకుతుంద నే నమ్మకంతో ప్రతి ఏడాది మరింత మంది ని పర్యావరణహిత వినాయక చవితి వైపు ప్రోత్సహిస్తున్నాం. ముఖ్యంగా పిల్లలు, యు వతలో ప్రకృతిపై బాధ్యతను పెంపొందించడమే మా లక్ష్యం అని అన్నారు.