CJIపై కాంగ్రెస్ సంచలన వ్యాఖ్యలు
CJIపై కాంగ్రెస్ సంచలన పోస్ట్.. రాజీనామా చేయాలంటూ డిమాండ్.. బీజేపీ ఫైర్!
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ కేరళ విభాగం చేసిన Social Media Post రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీలో నిరసనలు, శాంతిభద్రతల అంశంపై సీజేఐ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఆయన రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పోస్టుపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మరింత ముదిరింది. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కాంగ్రెస్ కేరళ విభాగం కొద్ది గంటల్లోనే ఆ పోస్టును తొలగించింది.
‘రాజీనామా చేయండి’.. కాంగ్రెస్ ఘాటు వ్యాఖ్యలు
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో Twitter)లో కాంగ్రెస్ కేరళ విభాగం స్పందిస్తూ.. శాంతిభద్రతలు తన పరిధిలోకి రావని సీజేఐ భావిస్తే, వెంటనే రాజీనామా చేయాలని వ్యాఖ్యానించింది. ఆ బాధ్యతలు నిర్వహించగల వ్యక్తిని తాము వెతుక్కుంటామని పేర్కొంది. న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై రాజకీయంగా విమర్శలు మొదలయ్యాయి.
కాంగ్రెస్‌పై బీజేపీ ఎదురుదాడి
ఈ పోస్టుపై బీజేపీ కేరళ విభాగం తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ న్యాయవ్యవస్థను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆరోపించింది. గతంలో Emergency సమయంలో న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకొచ్చిన రోజులు ముగిశాయని పేర్కొంటూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని నూతన భారతదేశంలో అలాంటి ప్రయత్నాలు సాగవని X వేదికగా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ అంశం కాంగ్రెస్, బీజేపీ మధ్య Political Warకు దారితీసింది.
సీజేఐ అసలు ఏమన్నారు?
ఢిల్లీలో సోమవారం National Human Rights Commission (NHRC) 33వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ సూర్యకాంత్ మీడియాతో మాట్లాడారు. దేశ రాజధానిలో జరుగుతున్న నిరసనలు, వాటిపై విధిస్తున్న ఆంక్షల గురించి ప్రశ్నించగా.. అది శాంతిభద్రతలకు సంబంధించిన అంశమని, తన పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలనే కాంగ్రెస్ తన విమర్శలకు ఆధారంగా తీసుకుంది.
INDIA కూటమి అభ్యర్థనపై సీజేఐ స్పందన
మరోవైపు, ఓటర్ల జాబితా వివాదంపై ప్రతిపక్ష INDIA కూటమి నేతలు సమావేశం కావాలని కోరిన అంశంపైనా సీజేఐ వివరణ ఇచ్చారు. సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయని, పౌరులు లేదా ప్రజాప్రతినిధులు పిటిషన్ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని తెలిపారు. ప్రతిపక్షాల అభ్యర్థన తనకు అందిందని, అయితే వారు ప్రస్తావించిన అంశాలు ఇప్పటికే సుప్రీంsకోర్టు విచారణ పరిధిలో ఉన్నందున ప్రత్యేక సమావేశం నిర్వహించడం సముచితం కాదని లేఖ ద్వారా తెలియజేసినట్లు చెప్పారు.
సమావేశం కోరడం కంటే Legal Processను అనుసరించి పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. ఇదే తరహా అంశాలపై అక్టోబర్ 13న విచారణ జరగాల్సి ఉందని కూడా పేర్కొన్నారు. సీజేఐ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. కాంగ్రెస్ పోస్టు, బీజేపీ కౌంటర్‌తో రాజకీయంగా మరింత వేడెక్కింది. న్యాయవ్యవస్థ పరిధి, రాజకీయ పార్టీల వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ కొనసాగుతోంది.