క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అధికారులు

12-10-2026 | 09:49pm

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో హై స్కూల్ ప్రీమియర్ లీగ్ సీజన్-2 క్రికెట్ టోర్నీ(High School Premier League Season-2 Cricket Tournament) ఎస్సై రమేష్ తో కలిసి గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ(Sarpanch Durgam Saroja) ప్రారంభించారు. సిర్పూర్ టి మాజీ ఎమ్మెల్యే కోనేరు కొన్నప్ప(Former MLA Koneru Konnappa) ఆధ్వర్యంలో సురేష్ కావిడె నిర్వహణలో టోర్నీ జరుగుతుందని తెలిపారు. ప్రథమ బహుమతి రూ.14,000,ద్వితీయ బహుమతి రూ.7,000గా నిర్ణయించారు.

బెజ్జూర్, కుకుడా, కుష్ణపల్లి, పాపన్ పేట్, చిన్నదిద్దాపూర్ గ్రామ పంచాయతీల యువత అర్హులు  అని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని క్రీడలతోపాటు చదువులో రాణించాలని సూచించారు. క్రికెట్ టోర్నమెంట్ లో ఏలాంటి గొడవలు జరగకుండా చూసుకోవాలని స్నేహభావంతో క్రీడాకారులు మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ ,వార్డు సభ్యులు గుమ్ముల శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగడపల్లి మహేష్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమీరోద్దీన్, నరేందర్ గౌడ్,తెలంగాణ జావిద్, మల్లేష్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు