ఎస్ఐఆర్ ప్రక్రియపై గందరగోళం

12-10-2026 | 09:43pm

రాజకీయ ప్రయోజనం పొందడమే కాంగ్రెస్ లక్ష్యం

బిజెపి మండల అధ్యక్షలు తిప్పర్తి నికేష్ 

గన్నేరువరం,(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) పారదర్శకంగా నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(Special Intensive Revision) ప్రక్రియపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తూ  విషప్రచారం చేస్తున్నాయని, ఎస్ఐఆర్ ప్రక్రియపై గందరగోళం సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందడమే కాంగ్రెస్ ఏకైక  లక్ష్యమని బిజెపి మండల అధ్యక్షలు తిప్పర్తి నికేష్ ధ్వజమెత్తారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటర్ల జాబితా(Voter lists)ను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో నకిలీ ఓట్లను తొలగించి అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే 'ఎస్ ఐ ఆర్' ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సర్ ఫై  అనవసర రాద్ధాంతం చేయడమే లక్ష్యంగా వ్యవహారాలు చేస్తున్న కాంగ్రెస్, సిజెపి వైఖరి ఉందని మండిపడ్డారు.

ఢిల్లీ కేంద్రంగా ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, సిజేపీలు ఈ విషయంలో చేస్తున్న తప్పుడు ప్రచారాలను,  వైఖరిని విడనాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఏలేటి చంద్ర రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పుల్లెల రాము, నాయకులు బండి తిరుపతి, మునిగంటి సత్తయ్య, బూట్ల సంపత్, పుల్లెల జగన్మోహన్,  సందనవేణి ప్రశాంత్, మాడుగుల రామకృష్ణారెడ్డి, ఎలేటి శేఖర్ రెడ్డి, గంట గౌతం, మునిగంటి లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు