పుష్కర ఘాట్లను పరిశీలించిన వైద్యశాఖ డైరెక్టర్

03-10-2026 | 08:03pm

భైంసా (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) బాసర పరిధిలోని పుష్కర ఘాటు(Basara Pushkar Ghat)ను రాష్ట్ర ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్(Director of Health and Family Welfare Dr. Ravindra Naik) శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సేవలు, అత్యవసర చికిత్స, అందించడానికి సదుపాయాలు తదితర ఏర్పాట్లను పరిశీలించారు.

భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి ఏర్పాట్లు చేయాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ డిప్యూటీ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆకాష్, కార్యక్రమ నిర్వాహణాధికారి డాక్టర్ సౌమ్య డిప్యూటీ జిల్లా విస్తరణ మరియు మీడియా అధికారి బారె రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు