పాపయ్యపల్లిలో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు

09-10-2026 | 08:05pm

బెజ్జంకి, అక్టోబర్ 9: బెజ్జంకి మండలం(Bejjanki Mandal) పాపయ్యపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో(Anganwadi Centre) ముందస్తు బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) శుక్రవారం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, అంగన్వాడీ సిబ్బంది(Anganwadi staff) బతుకమ్మ పండుగ సందడిలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. 

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. మహిళలు, చిన్నారులు పౌష్టికాహారంపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ భావన, వార్డు సభ్యులు తిప్పారపు మహేష్, లోనే నర్సింగరావు, పొట్లపల్లి శివకృష్ణ, అంగన్వాడీ టీచర్ జమున తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు