నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు
మూడు కేసుల నమోదు
800 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని(Burgampadu Mandal) భాస్కర్‌నగర్, సారపాక, గాంధీనగర్, సంజీవరెడ్డిపాలెం గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు(Prohibition and Excise officials) శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు కేసులు నమోదు(Cases registered) చేసి, ఐదు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 800 లీటర్ల బెల్లం పానకం (వాష్)ను ధ్వంసం చేశారు.ఖమ్మం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వి. సోమిరెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్, కొత్తగూడెం జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ. శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టారు.
అనంతరం ఆయా గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు, రవాణా వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎవరైనా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ దాడుల్లో భద్రాచలం ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎ. సీతారామరాజు, ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ శ్రీహరిరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారి సమీవుల్లా ఖాన్‌తో పాటు ఎక్సైజ్ సిబ్బంది కరీం, సీతారామ్, శ్రావణ్, రాకేష్, రమేష్‌బాబు పాల్గొన్నారు.