బిఎల్ఓ కేంద్రం పరిశీలన
03-10-2026 | 06:20pm
నిర్మల్,(విజయక్రాంతి): భారత ఎన్నికల కమిషన్(Election Commission of India) ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లాలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలు క్షేత్రస్థాయిలో జిల్లా ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీదేవి(District Special Senior IAS Officer Sridevi) తనిఖీ చేశారు. నిర్మల్ రూరల్ మండలంలోని కొత్త పోచంపాడు గ్రామంలో గల పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి సర్పక్రియ దరఖాస్తులను నోటీసుల జవాబులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా, ఆర్డీవో దేవిదాస్, తాసిల్దార్ ప్రభాకర్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, అధికారులు ఉన్నారు.