తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్‌లో జిల్లాకు 9 పతకాలు

03-10-2026 | 06:49pm

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ 5వ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్–2026(Telangana 5th Police Sports & Games Meet – 2026)లో క్లస్టర్–C విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 9 పతకాలు సాధించారు. ఇందులో 3 బంగారు, 3 వెండి, 3 కాంస్య పతకాలు ఉన్నాయి.

టెన్నిస్ విభాగంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఈ. విజయ్ బాబు(AR Additional SP E. Vijay Babu) టెన్నిస్ డబుల్స్‌లో బంగారు పతకం, సింగిల్స్‌లో వెండి పతకం సాధించారు. ఆర్‌ఐ వెల్ఫేర్ కృష్ణారావు, సీఐ పాల్వంచ కె. సతీష్‌లు టెన్నిస్ ఓపెన్ డబుల్స్, 40+ డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించారు. కృష్ణారావు ఓపెన్ సింగిల్స్‌లో కాంస్య పతకం, కె. సతీష్ 40+ సింగిల్స్‌లో వెండి పతకం సాధించారు.

బ్యాడ్మింటన్ విభాగంలో పీసీ జి. ప్రవీణ్ ఓపెన్ మెన్ సింగిల్స్‌లో, డబ్ల్యూపీసీ కె. నాగస్వరూప ఓపెన్ ఉమెన్ సింగిల్స్‌లో కాంస్య పతకాలు సాధించారు. వీరిద్దరూ కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో వెండి పతకం సాధించారు. జిల్లా పోలీస్ క్రీడాకారులు సాధించిన ఈ విజయాలపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా సేవలందిస్తూ, క్రీడల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరచి జిల్లాకు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు