కొమురం భీం వర్ధంతి వేడుకలు

26-10-2026 | 07:32pm

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివాసీ నాయకపోడు సంఘం ఆధ్వర్యంలో కొమరం భీం వర్ధంతి(Komaram Bheem Death Anniversary) వేడుకలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కొమరం భీం విగ్రహానికి ఆ సంఘం నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన కొమరం అని పలువురు నాయకులు కొనియాడారు.

పట్టణంతో పాటు బైంసా ఖానాపూర్ మామడ దిల్వార్పూర గ్రామాల్లో కూడా వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకయ్య గారి భూమయ్య ముసలి చిన్నయ్య లక్ష్మణ్ నవీన్ రమేష్ రాకేష్ మంద మల్లేష్ రాజేశ్వర్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు