ఎమ్మెల్యే పరామర్శ

03-10-2026 | 08:20pm

భైంసా (విజయక్రాంతి) : భైంసా మండలంలోని(Bhainsa Mandal) పాంగ్రి గ్రామానికి చెందిన నారాయణ పటేల్(Narayana Patel) గారి భార్య కుసుంబాయిగ అనారోగ్యంతో మృతి చెందారు ఈ విషయాన్ని తెలుసుకున్న ముధోల్ ఎమ్మెల్యే  శ్రీ పవార్ రామారావు పటేల్(Mudhol MLA Sri Pawar Ramarao Patel) శనివారం కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు