సమస్యలపై వెంటనే స్పందించాలి

24-09-2026 | 06:05pm

నిర్మల్ సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి): ప్రజలు ఏ సమస్య అధికారుల దృష్టికి తెచ్చిన వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారం చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(Nirmal MLA Maheshwar Reddy) అధికారులకు సూచించారు. సోన్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం మండల అభివృద్ధి, పై సమీక్షించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సంక్షేమ పథకాల అమలు, మౌలిక వసతులు,

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ లో ఉన్న పనులను వేగవంతం చేసి, అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ సంతోష్, వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు