ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలి

24-09-2026 | 06:21pm

ఖానాపూర్ ( విజయక్రాంతి) :ఏ శాఖలో పనిచేసే ఉద్యోగి అయిన ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ శాఖ సమర్థవంతంగా ముందుకు వెళుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్(District Medical Officer Dr. Rajender) అన్నారు. మామడ మండలంలోని కప్పనపల్లి గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ ఉద్యోగులకు ప్రజలకు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 200 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూత్రాలు తెలిపారు. ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఎఫ్డిఓ నాగిని భాను, డీఎస్సీ వైద్యులు రాజేందర్ రెడ్డి స్వాతి ఎఫ్ ఆర్ వో శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు