బీజేపీ ఉచిత వైద్య శిబిరం

24-09-2026 | 06:24pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : మంచిర్యాల వైశ్య భవన్ లో(Mancherial Vysya Bhavan) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సేవ సంకల్ప్ అభియాన్ లో భాగంగా రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురు వారం కరీంనగర్ ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించగా సుమారు రెండు వేల మందికి వైద్య సేవలు అందించి మందులు అందించారు.

అవసరమైన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సు లో 2D ఎకో, చెస్ట్ ఎక్స్ రే, మామోగ్రామ్ (రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్ష), ECG, షుగర్ వంటి పరీక్షలు ఉచితంగా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందులు కృష్ణ మూర్తి, కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, మోటపలుకుల తిరుపతి, బియ్యాల సతీష్ రావు, అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కుర్రె చక్రవర్తి, గడ్డం స్వామి రెడ్డి, రమణ రావు, ప్రేమ్ సింగ్, పచ్చ స్వప్న రాణి, గోపతి రాజయ్య, కర్రె లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు