విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు

24-09-2026 | 06:18pm

నిర్మల్ సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి): ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)  25 ఏళ్ల ప్రజా సేవ, సమర్పణను పురస్కరించుకుని “25 సంవత్సరాల సేవ మరియు సమర్పణ – అభివృద్ధి చెందిన భారతదేశం” అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.  పట్టణంలోని KGBV, సోఫినగర్ లో చిత్రలేఖన పోటీ నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్వహించిన ఈ పోటీలో మొత్తం 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ సుజాత ఉపాధ్యాయులు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు