పదవి విరమణ పొందిన పోలీసు ఉద్యోగులకు సన్మానం

31-10-2026 | 11:05pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పోలీస్ శాఖ(Nirmal district police department)లో సుదీర్ఘకాలం పనిచేసి ఈనెల 31న పదవీ విరమణ పొందుతున్న పోలీసు ఉద్యోగులను సన్మానం చేశారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పి ఉపేందర్ రెడ్డి(Additional SP Upender Reddy) ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు గోవర్ధన్ రెడ్డి, సమ్మయ్య, ఎస్‌ఐలు లింబాద్రి, గోపి, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. సాయికుమార్, ఉపాధ్యక్షులు ఎం. కృష్ణ (సీఐ), కే. సాయికృష్ణ (ఆర్‌ఎస్ఐ), జాయింట్ సెక్రటరీ సంతోష్, కోశాధికారి మాధవ్, కమిటీ సభ్యులు మహేందర్ రెడ్డి, సాయికిరణ్, వెంకటరమణ, గంగాధర్, పోలీస్ అసోసియేషన్ సభ్యులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధికారులు వారి సేవలను అభినందిస్తూ, పదవీ విరమణ అనంతరం ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు