నూతన కమిటీ ప్రమాణ స్వీకారం
నిర్మల్ అక్టోబర్ 13 ( విజయక్రాంతి): ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యవర్గము చైర్మన్ గా గొజ్జ జనార్ధన్, వైస్ చైర్మన్ గా లింగన్న, కోశాధికారిగా అల్లాడి రవి, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సామనపల్లి రాఘవులు, సభ్యులుగా అయ్యన్న గారి భూమయ్య,లోలం గంగన్న,
ఎం. రాజేశ్వర్, మంచిర్యాల నాగభూషణ్, నాయిడి రమేష్, ముజాయిద్ గారి లచే ప్రమాణ స్వీకారం చేయించి, వారికి అధికారిక పత్రములను ఎన్నికల అధికారి శ్రీ.కె.సత్య నారాయణ మరియు సహాయ ఎన్నికల అధికారి శరత్ బాబు అందజేసినారు.
ఈ కార్యక్రమం లో, నిర్మల్ డివిజనల్ రెవిన్యూ అధికారి శ్రీ దేవదాసు గారు,శ్రీ నాగ వర్ధన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి విజయలక్ష్మి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కే పోతారెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వెలుమల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కుడాల రవికుమార్, ఏఈవోల సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ గారు,
రావుల రాంనాథ్ అదేవిధంగా టీఎన్జీవోల కార్యవర్గ సభ్యులు, అనేకమంది పెన్షనర్లు హాజరై రెడ్ క్రాస్ సంస్థ నిర్మల్ జిల్లా మేనేజ్మెంట్ కమ్యూనిటీ సభ్యులందరినీ ఘనంగా సత్కరించారు. తర్వాత ఎన్నికల అధికారి గారు వివరిస్తూ పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ రెడ్ క్రాస్ సంస్థ ముఖ్య లక్ష్యాలను వివరిస్తూ, తాను ఈ జిల్లా మేనేజ్మెంట్ కమిటీకి కార్యదర్శి వ్యవహరించనున్నట్లు తెలియజేశారు.