విద్యుత్ ప్రమాదం జరగకుండా చర్యలు

21-09-2026 | 05:07pm

నిర్మల్,(విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో(Ganesh in Navratri celebrations) భాగంగా వినాయక శోభాయాత్ర(Vinayaka procession) రూట్ మ్యాప్ ను జిల్లా పర్యవేక్షక ఇంజనీర్(District Superintending Engineer) బి.రమేష్, డి.వెంకటేశ్వర్లు, పట్టణ ఏడిఏ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈనెల 24న నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను వెంటనే సరి చేస్తున్నట్టు తెలిపారు. మండపాల నిర్వాహకులు విద్యుత్ వైర్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సిబ్బందిని అప్రమత్తంగా ఉంచడం జరిగిందని తెలిపారు. బంగాల్పేట్ వినాయక సాగర్ వద్ద లైటింగ్ సిస్టన్ని పొరపాటు లేకుండా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు

మరిన్ని వార్తలు