ఏరాజ్పల్లి మహిళా సంఘం సభ్యులకు అక్షరమాల పరీక్ష

27-09-2026 | 07:51pm

బోధన్,సెప్టెంబర్ 27 (విజయ క్రాంతి): బోధన్ మండలంలోని(Bodhan Mandal) ఎరాజ్ పల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో(Erazpalli ZPHS School) మహిళా సంఘం సభ్యులకు(Womens Association members) 'అమ్మకు అక్షరమాల' పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ మహిళా సంఘం సభ్యులు చదవడం, రాయడం నేర్చుకుంటే సంఘంలోని రుణ సదుపాయాలు, లావాదేవీలపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు ముక్తార్, మహిళా సంఘం విఓఏలు, అధ్యక్షురాలు, సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు