రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్‌కు ఘన సన్మానం

13-10-2026 | 03:20pm

బోధన్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): నిజామాబాద్ నగరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ(Indian Red Cross Society) జిల్లా చైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు, న్యాయవాది బాలాజీని బీజేపీ నాయకుడు పెర్కా వెంకటేష్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పోతంకర్ లక్ష్మీనారాయణ, న్యాయవాది బాలాజీలకు శాలువాలు కప్పి సత్కరించారు.

సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవలందించే వారిని గౌరవించడం అభినందనీయమని పెర్కా వెంకటేష్ పేర్కొన్నారు.ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే వ్యక్తులను గుర్తించి గౌరవించడం ద్వారా మరింత మంది సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సాహం పొందుతారని అన్నారు. సేవా రంగంలో పనిచేసే వ్యక్తుల పట్ల గౌరవాన్ని చాటడమే ఈ సన్మాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమం నిజామాబాద్ నగరంలో నిర్వహించారు.

మరిన్ని వార్తలు