వార్డు సమస్యలు పరిష్కరించాలని వినతి
భిక్కనూర్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bhikkanur Mandal) కాచాపూర్ గ్రామంలోని 7వ వార్డు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్(Sarpanch Palamakula Jyothi Santhosh), కార్యదర్శికి వినతిపత్రం(Memorandum) అందజేశారు. వార్డులో వీధిదీపాల మరమ్మతులు(Street light repairs), మురుగు కాలువల శుభ్రత, మంచినీటి పైపులైన్, బోర్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు చేపట్టాలని కోరారు. పాత గ్రామపంచాయతీ భవనాన్ని పునరుద్ధరించి కమ్యూనిటీ హాల్‌గా మార్చాలని, పెద్ద ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తిచేసినట్లు తెలిపారు. దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వార్డు వాసులు తెలిపారు.