అన్నపూర్ణాదేవి అలంకారం

13-10-2026 | 06:00pm

సుల్తానాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): దేవి నవరాత్రి ఉత్సవాల్లో మూడవ రోజైనా మంగళవారం అన్నపూర్ణాదేవి అలంకరణ లో (Alankaram as Goddess Annapurna) దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో(Arya Vysya Bhavan) జరిగిన వేడుకల్లో  దుర్గాదేవి అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు... కొమురవెల్లి సుజాత అంజయ్య , కొమురవెల్లి మౌనిక అన్వేష్ దంపతులు పూజ అనంతరం అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు