రక్తదానం... ప్రాణ దానంతో సమానం
- పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్‌రెడ్డి
- రక్తదాన శిబిరం కు భారీ స్పందన...
సుల్తానాబాద్, అక్టోబర్ 30 (విజయ క్రాంతి): రక్తదానం చేయడం ప్రాణదానం తో సమానం అని పెద్దపల్లి డిసిపి భూక్యా రామిరెడ్డి(Peddapalli DCP Bhukya Rami Reddy) అన్నారు, పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఎస్వీఆర్ గార్డెన్లో నిర్వహించిన రక్తదాన శిబిరంకు అపూర్వ స్పందన లభించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డీసీపీ రామ్‌రెడ్డి, ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి సకాలంలో అందించేందుకు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం చేసిన మూడు నెలల్లోనే శరీరంలో తిరిగి రక్తం సమకూరుతుందని తెలిపారు.
సాధారణంగా ఒక్కో వ్యక్తి నుంచి 250 నుంచి 300 మిల్లీలీటర్ల వరకు రక్తాన్ని సేకరించి అవసరమైన వారికి అందిస్తారని వివరించారు. ఆరోగ్యవంతులు రక్తదానం చేయడం వల్ల సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో కనీసం వెయ్యి మంది రక్తదాతలను సిద్ధం చేసేలా ఎస్సైలు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీఐ పొన్నమనేని రంజిత్‌రావు, ఎస్సైలు చంద్రకుమార్, మధుకర్, సుధాకర్, రెడ్‌క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ప్రతినిధులు వలస నీలయ్య , ఎర్రబెల్లి సుధీర్ రావు, తమ్మన వేని సతీష్ కుమార్, దీకొండ భూమేష్ , మాటేటి సంజీవ్ కుమార్, డివిఎస్ మూర్తి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కావేటి రాజగోపాల్, ఊట్కూరి రాధాకృష్ణ , డాక్టర్ ఎం ఎల్ ఎన్ రెడ్డి , పిట్టల వెంకన్న , పోలీసు సిబ్బంది, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు