రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

22-10-2026 | 03:16pm
  1. సుల్తానాబాద్  ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ కోయ శ్రీహర్ష 
  2. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి
  3. మందులు, వైద్య పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచాలి

సుల్తానాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష(Collector Koya Sriharsha) వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు,గురువారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు, మందుల నిల్వలు, వైద్య పరీక్షల నిర్వహణ, ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  వైద్యులు, వైద్య సిబ్బంది విధులకు నిర్దేశించిన సమయానికి హాజరై, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని  సూచించారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఓపీ సేవలను మరింత మెరుగుపరచాలని, రోగులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించాలని ఆదేశించారు. రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన పరిస్థితులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.మందులు, వైద్య పరీక్షల కిట్లు అందుబాటులో ఉండాలి అన్నారు.

ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు..రోగులతో మర్యాదగా వ్యవహరించాలన్నారు,ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రోగుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ ప్రభుత్వ వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష  సూచించారు.ఈ పర్యటనలో సంబంధిత డాక్టర్ లు,తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు