అనారోగ్య బాధితుడికి మంత్రి శ్రీధర్‌బాబు భరోసా
ఎలువాక చంద్రయ్య వైద్యం కోసం రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు
రామగిరి, అక్టోబర్ (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామానికి చెందిన ఎలువాక చంద్రయ్యకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) అండగా నిలిచారు. ఆయన చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1,50,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరైంది.
చికిత్స కోసం ఆర్థిక సహాయం అవసరమని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీని అందజేశారు. ఆపద సమయంలో స్పందించి వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి శ్రీధర్‌బాబుకు చంద్రయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.