కళ్యాణి అలంకారంలో దర్శనమిచ్చిన గజ్వేల్ మహంకాళి

13-10-2026 | 06:23pm

అమ్మవారికి అన్న పూజ నిర్వహించిన అర్చకులు

గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్ పట్టణంలోని మహంకాళి ఆలయంలో(Mahankali Temple) దేవి భాగవతాన్ని అనుసరించి నిర్వహిస్తున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవరోజు కళ్యాణి అలంకారంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక కుంకుమార్చన లో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు.

అమ్మవారికి దాన్యరాశులతో అభిషేకం చేసి గర్భాలయంలో అన్న పూజ నిర్వహించారు.  ఆలయ కమిటీ అధ్యక్షులు కాల్వ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు చాడ నంద బాల శర్మ వైదిక నిర్వహణలో ఘనంగా కొనసాగుతున్న ఉత్సవాలలో  కమిటీ సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు