రామగుండం ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్త పార్కు ప్రారంభం

02-11-2026 | 12:42pm

గోదావరిఖని, నవంబర్ 02 (విజయ క్రాంతి): రామగుండం నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. ఇందులో భాగంగా పవర్‌హౌస్ కాలనీలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును సోమవారం ఆయన ప్రారంభించారు (Inauguration).

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు ఉదయం, సాయంత్రం వేళల్లో నడకకు, చిన్నారులు ఆటలాడుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు (Public Health). రామగుండం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు (Development).

ఈ కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్, అటవీ శాఖ డిప్యూటీ జీఎం కరుణ, సివిల్ డిప్యూటీ జీఎం వరప్రసాద్, ఎస్ఓ టు జీఎం చంద్రశేఖర్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు (Local Participation).

మరిన్ని వార్తలు