గేటుకు తాళం.. విద్యార్థులకు నిరీక్షణ

02-11-2026 | 09:43am

సమయపాలనపై ప్రజల ప్రశ్నలు

9.15 గంటలైనా తెరుచుకోని బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధాన ద్వారం

బెజ్జంకి,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన విద్యాసంస్థలో సమయపాలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉదయం 9.15 గంటలైనా ప్రధాన ద్వారం తాళం(Bejjanki Junior College Gate Closed) తెరుచుకోకపోవడంతో తరగతులకు హాజరయ్యేందుకు వచ్చిన విద్యార్థులు గేటు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపించింది. సాధారణంగా ఉదయం 9.30 నుంచి 9.40 గంటల మధ్య తరగతులు ప్రారంభమవుతుండగా, అందుకు ముందే కళాశాల ప్రధాన గేటు తెరిచి విద్యార్థులను లోపలికి అనుమతించాల్సి ఉంటుంది. అయితే 9.15 గంటల సమయంలోనూ గేటుకు తాళం వేసి ఉండటాన్ని అటుగా వెళ్తున్న ప్రజలు గమనించారు.

విద్యార్థులు(Students) సమయానికి కళాశాలకు చేరుకున్నప్పటికీ గేటు తెరుచుకోక బయట వేచి ఉండాల్సి రావడం చర్చనీయాంశమైంది. విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలన నేర్పాల్సిన విద్యాసంస్థలోనే ఈ పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు సమయపాలన కూడా అంతే ముఖ్యమని, సంబంధిత అధికారులు ఈ అంశంపై దృష్టి సారించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు