అక్రమంగా తరలిస్తున్న 11 ఆవుల పట్టివేత
- మంథని మండలం అక్కేపల్లి వద్ద టాస్క్‌ఫోర్స్ దాడి
- రెండు వాహనాలు స్వాధీనం.. ఇద్దరు నిందితుల గుర్తింపు
మంథని, అక్టోబర్ 13(విజయ క్రాంతి): ములుగు జిల్లా నుంచి కరీంనగర్ పట్టణానికి అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు వాహనాలను రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు(Police Commissionerate Task Force police) చాకచక్యంగా పట్టుకున్నారు. మంథని మండలం అక్కేపల్లి గ్రామం వద్ద చేపట్టిన తనిఖీల్లో 11 ఆవులతో పాటు రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వాహనాల తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో పశువులను తరలిస్తున్న మహీంద్రా క్యాంపర్, అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనాలను గుర్తించి పట్టుకుంది.
స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాల ప్రకారం 11 ఆవులు
మహీంద్రా క్యాంపర్ వాహనం నంబర్. టీఎస్ 05 యూఏ 8482
అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనం నంబర్. టీఎస్ 30 టీ 5371
ఈ ఘటనలో ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన ఇస్లావత్ సోమన్న (45), ఎం.డి. తుఫాన్ (37)లను నిందితులుగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న పశువులు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంథని పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.