నేడు భైంసాలో పోలీస్ ప్రజావాణి రద్దు

13-10-2026 | 05:15pm

భైంసా) ( విజయక్రాంతి): జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి బుధవారం బైంసా పోలీస్ కార్యాలయంలో(Bhainsa Police Office) నిర్వహించి పోలీస్ ప్రజావాణి రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila) తెలిపారు. బుధవారం జరగవలసిన ప్రజావాణి అనివార్య కారణాల రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎవరూ రావద్దని సూచించారు.

ప్రజావాణి గురువారం భైంసా క్యాంప్ కార్యాలయంలో యథావిధిగా నిర్వహించబడుతుంది. కావున ప్రజలు ఈ విషయాన్ని గమనించి, గురువారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకురావాలని కోరడమైనది.

మరిన్ని వార్తలు