బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద హైమాస్ లైట్లు ఏర్పాటు చేస్తాం

13-10-2026 | 05:31pm

బోథ్. అక్టోబర్ 13 (విజయ క్రాంతి): 44వ నెంబర్ జాతీయ రహదారి(National Highway) పైన ఉన్న బోత్ ఎక్స్ రోడ్డు వద్ద హైమాస్ లైట్లను రెండు రోజుల్లో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పేర్కొన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వెళుతుండగా ఎక్స్ రోడ్ లో ఉన్న ప్రయాణికులతో మాట్లాడారు.  ప్రయాణికులు రాత్రిపూట విద్యుత్ యొక్క తీర ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది.

దీంతో స్పందించిన ఎమ్మెల్యే రెండు రోజుల్లో హైమాస్లైట్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. గత కొన్ని రోజులుగా ఎక్స్ రోడ్డులో విద్యుత్ లేక రాత్రిపూట ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సమీపంలో అటవీ ప్రాంతం ఉండడంతో మహిళా ప్రయాణికులు ఇక్కడ దిగేందుకు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే హామీతో ప్రయాణికులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని వార్తలు