భూ భారతి రీసర్వేపై పోతారం లో తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి అవగాహన

08-10-2026 | 02:23pm

ముత్తారం, అక్టోబర్ 08(విజయ క్రాంతి): భూ భారతి రీసర్వే ద్వారా భూ వివరాలను పక్కాగా నమోదు చేసుకునే అవకాశం ఉందని తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి(Tehsildar Madhusudan Reddy) తెలిపారు. గురువారం మండలంలోని పోతారం గ్రామంలో భూ భారతి రీసర్వే కార్యక్రమంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏడీ సోమేశ్వర్‌రావు రీసర్వే ప్రక్రియ, భూముల హద్దుల నిర్ధారణ, పట్టా పాస్‌బుక్‌ల ప్రాముఖ్యతపై వివరించారు.

భూ వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా సర్వేయర్లు క్షేత్రస్థాయిలో రీసర్వే నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. రీసర్వే సమయంలో గ్రామస్తులు అధికారులకు సహకరించి తమ భూములకు సంబంధించిన వివరాలను సరిచూసుకోవాలని తహసీల్దార్  సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ చరణ్, సర్వేయర్లు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు