తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండగ
ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి
సుల్తానాబాద్, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, ఆడపడుచులకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుక గొప్పదని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి(Narender Reddy, Head of Alfores Educational Institutions) అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజిస్తూ జరుపుకునే బతుకమ్మ పండుగ మన సాంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. పలు రకాల పూలతో బతుకమ్మలను పేర్చి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆడుకునే ఆనందంగా జరుపుకునే ఈ పండగ తెలంగాణ ప్రజల జీవనశైలిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందన్నారు.
సామాజిక ఐక్యతను చాటిచెప్పే గొప్పతనం బతుకమ్మ పండుగ అన్నారు. విద్యార్థులకు విద్యాబోధన తో పాటు భారతీయ సంస్కృతి తెలంగాణ సాంప్రదాయాల పట్ల అవగాహన కల్పించడంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ ముందుంటాయన్నారు,
అందులో భాగంగానే ముందస్తుగా పాఠశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు, నూతన వస్త్రాలు ధరించిన విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.