దొంగతనాలపై అప్రమత్తంగా ఉండాలి

13-10-2026 | 04:46pm

చందుర్తి సీఐ రవీందర్

చందుర్తి, అక్టోబర్ 13, ( విజయక్రాంతి ) : దసరా పండుగ సెలవులకు ఇల్లు విడిచి సొంత ఊళ్లకు , బంధువుల ఇళ్లకు, విహారయాత్రలకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చందుర్తి సీఐ రవీందర్(Chandurthi CI Ravinder) సూచించారు. ఇళ్లను ఖాళీగా ఉంచి వెళ్లే సమయంలో విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని తెలిపారు.

ఇళ్లకు సీసీ కెమెరాలు, సెక్యూరిటీ అలారాలు ఏర్పాటు చేసుకోవాలని, ద్విచక్ర వాహనాలకు అదనపు తాళాలు వేయాలని సూచించారు. ప్రయాణ వివరాలను సోషల్ మీడియాలో వెల్లడించవద్దన్నారు.

ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్-112 కు సమాచారం ఇవ్వాలని కోరారు. దసరా సందర్భంగా పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తారని సీఐ రవీందర్ తెలిపారు.

మరిన్ని వార్తలు