రాళ్లపేటలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
తంగళ్ళపల్లి, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) తంగళ్లపల్లి మండలం రాళ్లపేట గ్రామ పంచాయతీ(Rallapeta Gram Panchayat) కార్యాలయంలో లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను(Smart ration cards) సర్పంచ్ బాలసాని పరుశురాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మునిగేల రాజు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు రేషన్‌తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త కార్డులు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఇమామ్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, కాంగ్రెస్ మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ బాబు ఆలీ, నాయకులు కట్కం రాజశేఖర్, గణాధి కిషన్, ఇక్బాల్, సురేష్, దేవరాజు, బాలసాని శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.