భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులు జరుపుకోవాలి

21-09-2026 | 08:18pm

కోనరావుపేట,(విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రులు(Vinayaka Navaratri) జరుపుకోవాలని చేపూరి గంగాధర్ ఎస్సై రామ్మోహన్(Gangadhar SI Rammohan) అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం(Annadana program)లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నవరాత్రులు భక్తిశ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకొని వినాయకుని నిమజ్జనం చేయాలని కులమతాలకు అతీతంగా హిందువులు సాంప్రదాయంగా చేసుకునే పండగ వినాయక చవితి అని ఈ పండుగను భక్తిశ్రద్ధలతోనే జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ బా శెట్టి నాగరాజు. ఎంపీడీవో స్మిగ్దా రెడ్డి  ఆర్యవైశ్య సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు