దీక్షా దివాస్ స్ఫూర్తి సభకు తరలిరావాలి

27-11-2026 | 03:17pm

కేటీఆర్ సభకు ఇంటింటా ప్రచారం

తంగళ్లపల్లి, నవంబర్ (విజయ క్రాంతి):నవంబర్ 29న కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో నిర్వహించనున్న కేటీఆర్ దీక్షా దివాస్ స్ఫూర్తి(KTR Deeksha Divas) సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని తంగళ్లపల్లి పట్టణ బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ “తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో” అనే నినాదంతో దీక్ష చేపట్టారని ప్రజలకు వివరించారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదని, తెలంగాణ అంటేనే కేసీఆర్ అని పేర్కొంటూ ప్రచారం చేశారు. ప్రజలందరూ కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటూ మళ్లీ రావాలని కోరుకుంటున్నారని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తంగళ్లపల్లి పట్టణ అధ్యక్షుడు బండి జగన్, రామా గౌడ్, నేరెళ్ల అనిల్, బిక్షపతి, తిరుపతి, క్యారం జగత్ ఆచారంతో పాటు పట్టణ, మండల బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు