పోస్టుకార్డులతో పర్యావరణ చైతన్యం

31-10-2026 | 04:57pm

నీటి సంరక్షణ-విద్యుత్ పొదుపుపై ఆక్ష్ఫర్డ్ విద్యార్థుల వినూత్న ఉద్యమం

గంభీరావుపేట,(విజయక్రాంతి): నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణపై సమాజంలో చైతన్యం కల్పించాలనే లక్ష్యంతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్(Oxford High School) ఆధ్వర్యంలో శనివారం ‘పోస్ట్‌కార్డ్ మూవ్‌మెంట్’(Postcard Movement) నిర్వహించారు.

కార్యక్రమంలో విద్యార్థులు(Students) వివిధ ప్రభుత్వ అధికారులు, గ్రామాల సర్పంచులు, పాఠశాలలకు పోస్టుకార్డులు రాస్తూ నీటిని వృథా చేయకుండా సంరక్షించాలని, విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, పర్యావరణాన్ని కాపాడాలని సందేశాలు పంపించారు. నీటి సంరక్షణపై ప్రతిజ్ఞ చేయడంతో పాటు పాటలు, కవితలు, అవగాహన కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.

విద్యార్థుల ద్వారా కుటుంబాలు, గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకురావడమే ఈ ఉద్యమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ప్రతి నీటి చుక్కను కాపాడటం, అవసరం లేనప్పుడు విద్యుత్ పరికరాలను ఆపివేయడం వంటి అలవాట్లను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్కిరెడ్డి సంతోష్ రెడ్డి, ప్రైమరీ ప్రిన్సిపాల్ పంతులువారి పద్మజ, వైస్ ప్రిన్సిపాల్ చేపూరి కిషన్, అకాడమిక్ ఇన్‌చార్జ్ చాత్రబోయిన దేవరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు