రైతులకు గుడ్న్యూస్..ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తంగళ్లపల్లి, అక్టోబర్ 31 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని చీర్లవంచ, లక్ష్మీపూర్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centres) మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మునిగెల రాజు స్థానిక సర్పంచులు వేల్పుల రేణుక-రాజు, నాయిని సాయితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మునిగెల రాజు మాట్లాడుతూ.. రైతులు తమ వరి ధాన్యాన్ని మద్దతు ధరకు (Minimum Support Price) విక్రయించి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి (Farmers' Welfare) పెద్దపీట వేస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్లు (Paddy Procurement) నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, మండల ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఇట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బాలు, నాయకులు జూపల్లి రాజేశ్వర్ రావు, పెద్దూరి తిరుపతి, జలంధర్ రెడ్డి, యాస సందీప్, భారత్, తిరుపతి, రాజిరెడ్డి, శ్రీనివాస్, పరశరం, చందు, ప్రశాంత్, మహేష్, ఏపీఎం చంద్రయ్య, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.