అచలాపూర్ భక్తుల పూజలు

31-10-2026 | 05:10pm

స్వామి వారి ఆలయంలో సహస్రనామాలు పారాయణం 

బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం(Sriranganayaka Swamy Temple)లో మహిళా భక్తులు(Women Devotees) శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాలు(Lalita Sahasranama Stotras) పారాయణం చేశారు. తెల్లవారుజాముని ఆలయానికి భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం లలిత సహస్ర నామ స్తోత్రాలు పారాయణం చేశారు. సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అతి పురాతనమైన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పూజలు చేయడం స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందకరంగా ఉందని భక్తులు తెలిపారు.

దర్శనానికి వచ్చిన అచలాపూర్ భక్తులకు శ్రీ రంగనాయక స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్ ఆలయ చరిత్ర వివరించారు. ఆలయాల్లో ఉత్సవ కార్యక్రమాలు  చేసినా మాకు సమాచారం అందించండి అని కోరారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ అధ్యక్షుడు అన్న ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు