కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

31-10-2026 | 04:59pm

ముదిగొండ,(విజయక్రాంతి): రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)పై అసత్యప్రచారం తగదు. హత్యరాజకీయాలు భట్టి విక్రమార్క రాజకీయ చరిత్రలో లేవు. సామినేని రామారావు హత్య దారుణం, హత్య విషమై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. రామారావు హత్య రాజకీయం చేస్తూ భట్టి వికృమార్క పై సిపిఎం పార్టీ చేస్తున్న ఆరోపణలు వెన్నక్కి తీసుకోవాలి.

ముదిగొండ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ వర్ధంతి సందర్బంగా ఆమె చిత్ర పటానికి పూలు వేసి నివాళ్ళు అర్పించి, మల్లు భట్టి విక్రమార్కపై అసత్య ఆరోపణలను ఖండిస్తూ  మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పై అసత్యప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకొవాలని సిఐ మురళి కి పోలీస్ స్టేషన్లో పిర్యాదు అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడిపూడి బుచ్చిరామయ్య, నరసింహాస్వామి గుడి చైర్మన్ నరసింహారావు, ఐ ఎం టీ యూ జిల్లా అధ్యక్షులు ఉసికల రమేష్, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు