రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్లు ...

02-10-2026 | 09:31pm

సుల్తానాబాద్, అక్టోబర్ 02 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో జరగనున్న 36వ సబ్ జూనియర్, 52వ జూనియర్ రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు శుక్రవారం సుల్తానాబాద్ నుంచి బయలుదేరి వెళ్లాయి. పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా జట్లకు క్రీడా దుస్తులను జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు ధర్మయ్య, కరుణాకర్ రెడ్డి లు ప్రధానం చేశారు.

రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్లు అద్వితీయంగా రానించి విజయం సాధించాలని క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ సంఘం సభ్యులు సిలివేరి మహేందర్,  సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఉపాధ్యక్షులు బైరగోని రవీందర్ గౌడ్, జిల్లా కబడ్డీ సంఘం సంయుక్త కార్యదర్శి ఎండి షఫీ, హరికృష్ణ, రాజేందర్ రెడ్డి, టగ్ ఆఫ్ వార్ జిల్లా కార్యదర్శి ఆలేటి సంపత్ కుమార్,  ఆల్ఫోర్స్ పాఠశాల ప్రిన్సిపల్ గోపగోని సత్యం, ఫిజికల్ డైరెక్టర్లు, పి ఈ టి లు రాజేందర్, హరికృష్ణ, శివ, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు