మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత ఊరేగింపు

11-10-2026 | 10:12pm

రుద్రంగి అక్టోబర్ 11 (విజయక్రాంతి) : రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండలకేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు(Sharannavaratri celebrations) ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాలక్ష్మి వీధిలో మహాలక్ష్మి యూత్(Mahalakshmi Youth) ఆధ్వర్యంలో  నేలకొల్పిన మండపం లో కొలువుదీరిన దుర్గామాత.ఈ సందర్భంగా యూత్ సభ్యులు దుర్గామాత విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకవచ్చి మండపంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు దుర్గామాతకు మంగళహారతులతో స్వాగతం పలికారు.

ఊరేగింపులో చిన్నారులు చేసిన సంస్కృతిక నృత్యలు అలరించాయి.ఈ సందర్బంగా నిర్వాహకులు మాట్లాడుతూ. ప్రతి ఒక్కరు బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలను ప్రశాంతంగా సంతోషంగా జరుపుకోవాలని కోరారు.ఆ దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా దుర్గాదేవి నవరాత్రులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు