మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

22-09-2026 | 09:53pm

-పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి..

-గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలి..

కోనరావుపేట, సెప్టెంబర్‌ 22 (విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికుల(Mid Day Meal Workers) సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి(CITU District President Egamanti Yellareddy) డిమాండ్‌ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్న భోజన కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టారు.

ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. తమ వేతనాలు, వంట సామగ్రికి సంబంధించిన బిల్లులు సుమారు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పెండింగ్ లో వున్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.8 సరిపోవడం లేదని, పెద్ద తరగతుల విద్యార్థులకు రూ.25, చిన్న పిల్లలకు రూ.15 చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.8 ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.5 మాత్రమే చెల్లిస్తోందని తెలిపారు.వంటకు అవసరమైన గ్యాస్‌ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించి, పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరారు. ఈ సమ్మెలో మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు