కుటుంబంలో తీవ్ర విషాదం
09-10-2026 | 05:43pm
పాము కాటుకు గురై అక్క మృతి చెందిన మూడు రోజుల్లోనే చెల్లెలు మృతి
మూసాపేట్ /అక్టోబర్ 9: మండల పరిధిలోని నిజాలపూర్ గ్రామంలో(Nijalapur Village) తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గోల్ల శ్రీనివాసులు కొండమ్మ దంపతుల ఇద్దరు కూతుళ్లకు ఈనెల ఆరవ తేదీన పాము కలవడంతో మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి(Mahabubnagar Government Hospital) తీసుకెళ్తుండగా పెద్ద కూతురు లావణ్య 17 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందింది. రెండవ కూతురు శ్రావణి(Sravani) 8 సంవత్సరాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా శుక్రవారం మృతి చెందింది . ఓకే కుటుంబంలో పాముకాటుకు గురై ఇద్దరు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.