రోడ్డు భద్రతపై అవగాహన..
బెజ్జూర్ అక్టోబర్ 13 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండలంలోని నాగులవాయి గ్రామంలో(Nagulavayi Village) ఎస్ఐ కే. రమేష్ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం(Awareness Program) నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల రేచిని గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ నికూరి అనంతరావు, ఆయన చిన్నాన్న నికూరి రాజయ్య సలుగుపల్లి శివారులో రోడ్డు మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
వాహనాలను అతివేగంగా నడపకుండా నెమ్మదిగా, అప్రమత్తంగా నడపాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మోటార్ సైకిల్‌పై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని తెలిపారు. రోడ్డు మలుపుల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మన ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలని ఎస్ఐ కే. రమేష్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.