మున్సిపల్ చెత్తలో బయో వేస్ట్!

29-10-2026 | 05:30am
  1. శాస్త్రీయ నియమాలు అటకెక్కాయ్..
  2. పర్యవేక్షణ అధికారులు ఎక్కడ 
  3. టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేస్తేనే స్పందిస్తారా?

రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ఆసుపత్రులే పర్యావరణానికి, పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయి. నిబంధనలను నట్టేట ముంచుతూ మున్సిపల్ డస్ట్ బిన్లలో అత్యంత ప్రమాదకరమైన బయో-మెడికల్ వ్యర్థాల(Bio Medical Waste)ను పార బోస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టాస్క్ఫోర్స్ విభాగం తాజాగా నిర్వహించిన తనిఖీల్లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూశాయి. నగరం లోని 45 ప్రధాన కార్పొరేట్, మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు రోజువారీగా ఉత్పత్తి చేస్తున్న దాదాపు 14.8 టన్నుల బయో-మెడికల్ వ్యర్థాలలో సుమారు 32 శాతం వ్యర్థాలు అసలు అధీకృత రీసైక్లింగ్ యూనిట్లకు చేర డం లేదు. సీబీడబ్ల్యూటీఎఫ్ సంస్థలకు చెల్లించాల్సిన రుసుములను తగ్గించుకోవడానికి, ఖర్చులను ఆదా చేసేందుకు కొన్ని యాజమాన్యాలు కాంట్రాక్ట్ సిబ్బంది ద్వారా రాత్రివేళల్లో రహస్యంగా ఈ వ్యర్థాలను ము న్సిపల్ చెత్త కుండీల్లో వేయిస్తున్నట్లు విచారణలో తెటతెల్లమైంది.

సిరంజీలు, వాడి పారే సిన గౌన్లు, రక్తం అంటిన పత్తి, సర్జికల్ బ్లేడ్లు, మానవ కణజాలం వంటి ప్రమాదకర వ్య ర్థాలు బహిరంగంగా మున్సిపల్ చెత్తలో కలవడం వల్ల పారిశుధ్య కార్మికులు, చెత్త ఏరు కునే పిల్లలు, వీధి కుక్కలకు హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, హెచ్‌ఐవి వంటి తీవ్రమైన ఇ న్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో ఈ వ్యర్థాలు నాాని భూగర్భ జలా లు కూడా విషపూరితమయ్యే ముప్పు పొంచి ఉంది.బయో-మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 ప్రకారం ఆసుపత్రి వ్యర్థాల నిర్మూలనపై స్పష్టమైన వర్గీకరణ ఉంది.

* పసుపు రంగు సంచి: మానవ అవయవాలు, కణజాలాలు, రక్తం అంటిన పత్తి, పాత బ్యాండేజీలు, గడువు తీరిన మందులు.

* ఎరుపు రంగు సంచి: ఐవీ సెట్లు, గ్లౌజులు, కాథెటర్లు, ట్యూబ్లు వంటి రీసైకిల్ ప్లాస్టిక్.

* తెలుపు రంగు డబ్బా: సూదులు, సిరంజీలు, స్కాల్పెల్స్, బ్లేడ్లు వంటి పదునైన లోహాలు.

* నీలం రంగు డబ్బా: గాజు సీసాలు, వయల్స్, మెడికల్ గ్లాస్ వేస్ట్.నిబంధనల ప్రకారం ప్రతి సంచిపై బార్కోడ్ ఉండాలి. వ్యర్థాల బరువు, తరలింపును జిపిఎస్ వాహనాల ద్వారా డిజిటల్గా ట్రాక్ చేయాలి. ఆసుపత్రిలో 48 గంటలకు మించి వ్యర్థాలను ఉంచకూడదు మరియు ఇన్ఫెక్షన్ వ్యర్థాలను ప్రాథమికంగా రసాయన శుద్ధి చేశాకే బయటకు పంపాలి.

రంగారెడ్డి జిల్లాలో పెరుగుతున్న ముప్పు:

రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల ప్రాంతాల్లో 120 కార్పొరేట్ హాస్పిటల్స్, 350 నర్సింగ్ హోమ్లు, 850 డయాగ్నోస్టిక్ ల్యాబ్లు, 200లకు పైగా డెంటల్, పీహెచ్సీలతో కలిపి మొత్తం 1,500 కంటే ఎక్కువ నమోదిత వైద్య సంస్థలు ఉన్నాయి. వీటిపై నిరంతర నిఘా లోపిస్తే ప్రజారోగ్యం క్షీణించే అవకాశం ఉందని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 మరియు బయో-మెడికల్ వ్యర్థాల నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడే ఆసుపత్రులపై ప్రభుత్వం, అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించనున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు....

ఆయా కార్పొరేట్, మల్టీ స్పెషాలిటీ దావకల్లు ప్రభుత్వాన్ని నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటి విడతగా భారీ మొత్తంలో పర్యావరణ నష్టపరిహారం విధించడంతో పాటు ఎన్‌ఓసీ రద్దు నోటీసులు జారీ చేస్తారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఆసుపత్రుల రిజిస్ట్రేషన్ను రద్దు చేసి, సదరు సంస్థలను సీల్ చేస్తారు.విద్యుత్ మరియు తాగునీటి సరఫరాను తక్షణమే నిలిపివేస్తారు. తీవ్రమైన నిర్లక్ష్యం వహించిన యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 1 లక్ష వరకు జరిమానా (లేదా రెండూ) విధిస్తారు.

అధికారులు తనిఖీలు చేయాలి....

జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రతి నెలా బయో-మెడికల్ వేస్ట్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించి తనిఖీలను ముమ్మరం చేయాలని, పర్యావరణ ఇంజనీర్లు, మున్సిపల్ పారిశుధ్య తనిఖీ అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు. ఇప్పటి కన్నా అధికారులు సంబంధిత దావకారణలో ప్రత్యేక బృందాలతో పర్యవేక్షణ చేసి ప్రభుత్వ నిబంధన ఉల్లంఘిస్తున్న దావకాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డి మాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు