పట్టభద్రులు ఓటు వేయాలి

27-10-2026 | 08:56pm

ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

ఎల్బీనగర్, అక్టోబర్ 27: పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) పిలుపునిచ్చారు. గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీ చౌరస్తాలో మంగళవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వరరావు, రమేష్ ముదిరాజ్, శ్రీశైలం యాదవ్, శైలజ, కొత్త రవీందర్ రెడ్డి, సుధీర్ గౌడ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు